Kargil Vijay Diwas: 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇవాళ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్గిల్‌లో పర్యటించనున్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర అమరవీరులకు నివాళులర్పించనున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్‌ని సందర్శించి 1999లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ప్రాణాలు అర్పించిన భారత సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ ఒక ప్రదేశం మాత్రమే కాదన్న రాహుల్‌గాంధీ.. ఇది పరాక్రమమని అభివర్ణించారు.