Kargil Vijay Diwas: 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇవాళ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్గిల్‌లో పర్యటించనున్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర అమరవీరులకు నివాళులర్పించనున్నారు.
దేశవ్యాప్తంగా కార్గిల్ వీరులకు నివాళులు అర్పిస్తున్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ కు కార్గిల్ యుద్ధం ద్వారా ధీటైన జవాబు చెప్పింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ పై 1999లో కార్గిల్ యుద్ధంలో గెలుపొందిన సందర్భంగా ప్రతీ ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ గా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్గిల్ వీరులకు నివాళులు అర్పించారు.
1999 మే 3 వ తేదీన ఇండియా పాక్ మధ్య వార్ ప్రారంభం అయింది. అంతకు ముందు 1999 ఫిబ్రవరిలో ఇండియా పాక్ మధ్య లాహోర్ శాంతి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం కాశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఇరు దేశాల సరిహద్దుల్లో ఎలాంటి కాల్పులకు పాల్పడకూడదు. కానీ, పాక్ దీనిని పక్కన పెట్టి ముష్కరులను, సైనికులను కార్గిల్ నుంచి సరిహద్దులు దాటించి ఇండియాలోకి పంపంది. అప్రమత్తమైన ఇండియా వారిని ఎదుర్కొన్నది. గడ్డకట్టే చలిని సైతం…