బాపట్ల జిల్లా.... అద్దంకి నియోజకవర్గం అంటేనే వర్గ రాజకీయాలకు కేరాఫ్. ఒకప్పుడు ఇక్కడ కరణం బలరాం వర్సెస్ బాచిన చెంచు గరటయ్యగా రాజకీయాలు నడిచేవి. ఆ తర్వాత గొట్టిపాటి రవికుమార్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. కొన్నాళ్ళు గొట్టిపాటి వర్సెస్ కరణం, మరి కొన్నాళ్ళు గొట్టిపాటి వర్సెస్ బాచిన కుటుంబాల పొలిటికల్ పోరు నడిచింది. రవికుమార్ నియోజకవర్గంలో పాతుకుపోవడంతో... ప్రత్యర్ధి ఎవరైనా గొట్టిపాటికి మరోవైపునే డీకొట్టాల్సిన పరిస్ధితి ఏర్పడిందన్నది లోకల్ టాక్.
చంద్రబాబుపై చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ రిజెక్ట్ చేసిన వాళ్ళందరిని పార్టీలోకి తీసుకున్న ఘనత చంద్రబాబుదని ఆరోపించారు. పార్టీలో పక్క నియోజకవర్గానికి పంపితే చెత్త అంటున్నాడని.. మరి అలాంటి చెత్తను టీడీపీలో చేర్చుకుంటే సెంటా అని నిలదీశారు. మరి అలాంటి చెత్తను మీరు మీ పార్టీలో చేర్చుకుని ఎంత మందిని పునీతులు చేస్తారో చెప్పాలని కౌంటర్ ఇచ్చారు.
Off The Record: బాపట్ల జిల్లా చీరాల. నిన్న మొన్నటి వరకూ మూడు ముక్కలాటగా కొనసాగిన ఇక్కడ వైసీపీ వ్యవహారాలకు పార్టీ అధిష్ఠానం చెక్ పెట్టింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పోతుల సునీత చీరాల వైసీపీలో మూడు పవర్ సెంటర్స్‌గా మారటంతో పార్టీ పరిస్థితి మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్నట్టుగా తయారైంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేసి ఓడారు. ఆమంచిపై గెలిచిన…