పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. గురువారం జరిగిన పురుషుల -60 కేజీల J1 విభాగంలో జూడోకా కపిల్ పర్మార్ కాంస్యం సాధించాడు. బ్రెజిల్‌కు చెందిన ఎలియెల్టన్ డి ఒలివెరాను ఇప్పన్ను కపిల్ పర్మా్ర్ ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా.. తాజా పతకంతో పతకాల సంఖ్య 25కి చేరింది. అందులో.. ఐదు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి.