కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ వాసన విద్యాసాగర్ నాయుడును ఇన్చార్జిగా నియమించారు. బదిలీ అయిన హర్షవర్ధన్ రాజును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలలో పేర్కొన్నారు.