సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతున్నాయి పల్లెలు.. ఆటలు, పాటలు, ముగ్గుల పోటీలు, కోడి పందాలు, గుండాటలు.. ఇలా అంతా కోలాహలంగా సాగుతోన్న పండుగ చివరి రోజుకు చేరుకుంది.. ఇక, కనుమ పండుగ సందర్భంగా నాన్‌వెజ్ మార్కెట్లు రద్దీగా మారిపోయాయి.. చికెన్, మటన్, చేపలు ఇలా నాన్‌వెజ్‌ను కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు తరలివస్తున్నారు జనం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు మరో రోజు సెలవుగా ప్రకటించింది.. దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో 73 జారీ చేశారు. అయితే, కనుమ రోజు సెలవు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి చేయగా.. దీంతో, కనుమ రోజు అంటే జనవరి 15వ తేదీన ప్రభుత్వ సెలవుగా ఖరారు చేశారు..