కంటి వెలుగు పథకం ఫేజ్ 2 కింద 59 పనిదినాల్లో కోటి 17 లక్షల మందికి పైగా కంటి పరీక్షలు చేయించుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కార్యక్రమం విజయవంతం కావడం పట్ల ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేస్తూ, కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులతో పాటు పరిపాలన, వైద్య సిబ్బందిని అభినందించినట్లు ఆదివారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. కంటి వెలుగు అవసరమైన ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో)ను హరీశ్‌రావు ఆదేశించారు.
Also Read : IB 71: ‘ఘాజీ’ దర్శకుడి మరో మిషన్… ట్రైలర్ అదిరింది
మిగిలిన జిల్లాలకు వచ్చే 41 పనిదినాల్లో లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. అద్దాల పంపిణీ కోసం కోర్టులు, జైళ్లు, పోలీసులు, ప్రెస్, ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక శిబిరాల సంఖ్యను పెంచాలని మంత్రి ఆదేశించారు. కంటి పరీక్షల అనంతరం ఇప్పటివరకు దాదాపు 15 లక్షల 86 వేల మందికి రీడింగ్ గ్లాసెస్ అందగా, మరో 9.95 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందాయి.
పరీక్షించిన 1.17 కోట్ల మందిలో 85 లక్షల 50 వేల మందికి అంటే మొత్తం 72 శాతం మందికి దృష్టి సంబంధిత సమస్యలు లేవని తేలింది.
Also Read : Karthik Dandu: విరుపాక్ష ఇతని ఫస్ట్ మూవీ కాదు… ఫస్ట్ సినిమా ఏంటో తెలుసా?