(డిసెంబర్ 9తో శభాష్ రాజాకు 60 ఏళ్ళు)నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా పి.రామకృష్ణ దర్శకత్వంలో రాజశ్రీ సంస్థ నిర్మించిన శభాష్ రాజా చిత్రం 1961 డిసెంబర్ 9న విడుదలయింది. ఏయన్నార్ సరసన రాజసులోచన నాయికగా నటించిన శభాష్ రాజా మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించారు. శభాష్ రాజా చిత్ర కథ, అంతకు ముందు ఏయన్నార్ తో సుందర్ లాల్ నహతా నిర్మించిన శాంతి నివాసం కథను పోలి ఉంటుంది.…