Kantha Rao Award To Suman: అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి. రామారావు తెలుగు చలన చిత్ర పరిశ్రమకులో అగ్ర హీరోలుగా వెలుగొందుతున్న సమయంలో వారికి దీటుగా హీరోగా కాంతారావు నిలబడ్డారని కాంతారావు శతజయంతి సభలో చెప్పారు ప్రముఖ నిర్మాత, దర్శకులు తమ్మా రెడ్డి భరద్వాజ. ఫిల్మ్ ఛాంబర్ లో ఆకృతి ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ లో రవీంద్రభారతి వేదిక గా కాంతారావు శత జయంతి పురస్కార సభను నిర్వహించనున్నట్టు తెలియచేస్తూ హీరో సుమన్ కాంతారావు శతజయంతి పురస్కారం అందుకుంటారన్నారు.
దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ‘కాంతారావు కత్తి యుద్దం అంటే నాకు చాలా ఇష్టం. నా సినిమా సుందరి- సుబ్బారావు లో ఆయన మంచి వేషం వేశారని తెలిపారు. కాంతారావు బయోపిక్ తీయనున్నట్లు పిపి ఆదిత్య చెప్పారు. ఆకృతి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫిక్కీ సి.ఎం.డీ అచ్యుత జగదీష్చంద్ర, కాంతారావు కుమారుడు, నటుడు రాజాతో పాటు పలువురు పాల్గొన్నారు.