కాంతార సినిమా మొదలు పెట్టినప్పుడు రిషబ్ శెట్టి.. ఇంత పెద్ద భారీ విజయాన్ని అందుకుంటానని ఊహించి ఉండడు. కన్నడలో ఒక్క చినుకు అన్నట్టుగా మొదలైన కాంతార.. ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తుఫాన్‌గా మారిపోయింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టించింది. విడుదలైన అన్ని భాషల్లోను కాంతార దుమ్ముదులిపేసింది. 16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా.. దాదాపు 450 కోట్ల వరకు రాబట్టింది. కాంతార పార్ట్ 1 పాన్ ఇండియా హిట్ అవ్వడంతో ఇప్పుడు…