Kantara 2: ‘కాంతార’లో సూపర్ స్టార్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంతార సినిమా మొదలు పెట్టినప్పుడు రిషబ్ శెట్టి.. ఇంత పెద్ద భారీ విజయాన్ని అందుకుంటానని ఊహించి ఉండడు. కన్నడలో ఒక్క చినుకు అన్నట్టుగా మొదలైన కాంతార.. ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తుఫాన్‌గా మారిపోయింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టించింది. విడుదలైన అన్ని భాషల్లోను కాంతార దుమ్ముదులిపేసింది. 16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా.. దాదాపు 450 కోట్ల వరకు రాబట్టింది. కాంతార పార్ట్ 1 పాన్ ఇండియా హిట్ అవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి కాంతార 2 పై పడింది. పార్ట్ 2 అప్డేట్ ఎప్పుడు? పార్ట్ 2 పనులు ఎంత వరకూ వచ్చాయి అని అందరూ అడుగుతుంటే రిషబ్ శెట్టి బయటకి వచ్చి “మీరు చూసింది పార్ట్ 2నే, ఇకపై రాబోయేది పార్ట్ 1” అంటూ అందరికీ స్వీట్ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం పార్ట్ 1కి స్క్రిప్ట్ వర్క్స్ చేస్తున్న రిషబ్ శెట్టి, ప్రీక్వెల్‌లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయని చెప్పాడు. హోంబలే ఫిల్మ్స్ కూడా పెరిగిన అంచనాలకు తగ్గకుండా భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తోంది. అందుకే ఈ సినిమాలో సూపర్ స్టార్‌ను ఇన్వాల్వ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
కాంతార సినిమా చూసిన రజనీకాంత్.. ఆ సినిమాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపంచారు. ఆ తర్వాత రిషబ్ శెట్టిని ఇంటికి పిలిపించి ఘనంగా సత్కరించారు. ఈ నేపథ్యంలోనే.. తాజాగా కాంతార 2లో రజనీకాంత్ ఉంటారా అనే ప్రశ్న ఎదురైంది రిషబ్ శెట్టికి. ఈ మోస్ట్ ఇంటరెస్టింగ్ క్వేషన్ కి రిషబ్ యస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు.. సైలెన్స్ ని మైంటైన్ చేశాడు. దాంతో సూపర్ స్టార్ రజినీకాంత్ కాంతార 2లో నటించబోతున్నారనే న్యూస్ వైరల్‌గా మారింది. ఒకవేళ నిజంగానే రజనీకాంత్ కాంతార 2లో నటిస్తే.. సినిమా పై మరింత వెయిట్ పెరిగినట్టే. అంతేకాదు పాన్ ఇండియా స్థాయిలో ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కు వెళ్లిపోతాయి. మరి రిషబ్ శెట్టి ఈ సారి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Also Read
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
- Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
-
India vs UK Healthcare: ‘భారత్‌లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
-
Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
-
Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
-
Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన ‘సీక్రెట్ సోల్జర్’
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!