ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అయోమయం గందరగోళంగా ఉందా? మరీ… నోట్లో నాలుక లేని వ్యక్తిని ఇన్ఛార్జ్‌గా పెట్టి పార్టీ అధిష్టానం చేతులు కాల్చుకుంటోందా? మేటర్ ఏదైనా సరే… పలాయనమే ఆ ఇన్ఛార్జ్‌కు తెలిసిన ఏకైక పరిష్కారమా? ఎవరా నాయకుడు? ఏంటా ఫెయిల్యూర్ స్టోరీ? ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్నట్లుగా మారాయని సొంతపార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన దద్దాల నారాయణ…
నేను పార్టీ మారుతున్నాను అని నా పై దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్. నాకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా నన్ను ఎమ్మెల్యేను చేశారు.. నేను జీవితాంతం వైఎస్ జగన్ తోనే ఉంటాను అని స్పష్టం చేశారు.
Off The Record: బుర్రా మధుసూదన్ యాదవ్. ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే. ఆ మధ్య వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించారు. కానీ పనితీరును కొలమానంగా చూపిస్తూ.. ఆరు నెలలు తిరక్కుండానే అధ్యక్ష బాధ్యతల నుంచి బుర్రాను తప్పించింది పార్టీ అధిష్ఠానం. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి బుర్రాకు కేడర్‌కు మధ్య గ్యాప్ వచ్చింది. సొంత సామాజికవర్గానికి చెందిన నేతలతోపాటు.. రెడ్డి సామాజికవర్గంతోనూ ఎమ్మెల్యేకు పడటం లేదు. దీంతో కనిగిరి వైసీపీలో రెండు గ్రూపులు…
బుర్రా మధుసూదన్. ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే. మూడేళ్లుగా పెద్దగా సమస్యలు లేకుండా రోజులు గడిచిపోయినా.. ఇప్పుడిప్పుడే నియోజకవర్గంలో రివర్స్ కొడుతోందట. ఇన్నాళ్లూ వైసీపీ ద్వితీయశ్రేణి నేతలతో సయోధ్య కుదుర్చుకుని సర్దుబాటు చేసుకున్నారు మధుసూదన్. ఇటీవలే కొత్తగా వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా కట్టబెట్టారు. కానీ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమమే ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్నాయట. సమస్యలపై కొందరు.. ఇన్నాళ్లూ ఏమైపోయారు అని ఇంకొందరు ప్రశ్నలు సంధిస్తుంటే.. వారితో వైసీపీ కేడర్ కూడా…
ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో 24 గంటలపాటు సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. రేపు ఉదయం నుంచి కర్ఫ్యూ సమయంలో ఉన్న సడలింపులు అమలు చేయనున్నారు. పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేస్తుండటంతో బస్సులను కనిగిరి డిపోకు పరిమితం…