Pakistan: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు దేశాల సరిహద్దు వెంబడి తీవ్రమైన కాల్పులు జరుగుతున్నాయి. మంగళవారం పాక్ దళాలు, ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో 15 మంది సాధారణ పౌరులు చనిపోయినట్లు ఆఫ్ఘాన్ తాలిబాన్ అధికారులు చెప్పారు.
‘ఆపరేషన్ సిందూర్’ లో భాగంగా భారత్ చేపట్టిన వైమానిక దాడిలో ఇప్పటికే 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అయితే.. ఈ దాడిలో జైషేను స్థాపించిన మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది కూడా హతమైన విషయం తెలిసిందే. మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఈ దాడిలో ప్రాణాలు కొల్పోయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.…
Taliban: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశంలో కఠిన ఆంక్షలు, చట్టాలు అమలవుతున్నాయి. ఇప్పటికే స్త్రీ విద్యను నిషేధించడంతో పాటు స్త్రీలు ఉద్యోగం చేయడాన్ని తాలిబాన్లు వ్యతిరేకిస్తున్నారు. మహిళల్ని వంటిళ్లకే పరిమితం చేశారు. చివరకు యూఎన్ కార్యక్రమాల్లో పనిచేసేందుకు కూడా వారిని అనుమతించడం లేదు. షరియా చట్టంతో ప్రజలపై తీవ్ర ఆంక్షల్ని విధిస్తున్నారు.
ఆఫ్ఘానిస్థాన్ తాలిబన్ల వశం అయిన తర్వాత కూడా పేలుళ్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.. మొన్నటి మొన్న మసీదులో ఆత్మాహుతి దాడిలో భారీ ప్రాణనష్టం జరగగా.. ఇవాళ కాందహార్‌లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ పేలుళ్లు జరిగాయి.. ఈ ఘటనలో మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చెబుతున్నారు.. కాందహార్‌లో నడిబొడ్డున్న ఉన్న మసీదులో ఈ పేలుడు సంభవించింది.. షియా వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఈ పేలుడు జరిగింది.. 16…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తాలిబన్ కీలక నేత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వ ఏర్పాటు కూర్పు నచ్చకనే ఆ కీలక నేత అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ముల్లా బరాదర్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ముల్లా మహమ్మద్ హసన్ ప్రధాని అయ్యారు. అదే విధంగా, ప్రభుత్వంలో హుక్కానీలకు పెద్దపీట వేస్తూ పదవులు అప్పగించారు. గతంలో దోహాలో జరిగిన సమావేశంలో తాలిబన్లు…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ఆరాచకాలు, ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే సంహభాగం ప్రాంతాలను తాలిబన్ ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే కాబూల్‌ను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటామని చెబుతున్న తాలిబన్లు తాజాగా కాందహార్ నగరాన్ని సొంతం చేసుకున్నారు. రాజధాని కాబుల్ తరువాత రెండో పెద్ద నగరంతో పాటుగా, ఆర్ధికంగా, వాణిజ్యపరంగా అభివృద్ది చెందిన నగరం కావడంతో దీనిపైనే దృష్టి పెట్టారు తాలిబన్ ఉగ్రవాదులు. అంతేకాదు, తాలిబన్ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది కూడా కాందహార్ నగరంలోనే కావడంతో ఇది వారికి కీలకంగా…