వైభవంగా దేవి నవరాత్రులు ముగిసినా ఇంద్రకీలాద్రిపై భవానిలా రద్దీ కొనసాగుతుంది… రాజరాజేశ్వరి రూపంలో దర్శనం ఇస్తున్న దుర్గమ్మను దర్శించుకోవటానికి భవానీలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. భవానీల రద్దీతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది… భవాని నామస్మరణతో దుర్గమ్మ కొండా మార్మోగుతుంది. దసరా ముగిసిన నిన్నటి అలంకారమే ఇవాళ కూడా భక్తులకు దర్శనం ఇవ్వటంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భవాని భక్తులు తరలి వస్తున్నారు… ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిగిన దేవి నవరాత్రుల్లో అంచనాకు మించి భక్తులు…
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. బెజవాడలో వెలిసిన జగన్మాత.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. భక్తుల కొంగు బంగారంగా పిలుచుకునే అమ్మవారు.. ఇంద్రకీలాద్రిపై కొలువై భక్తులను కాపాడుతున్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ఆరో రోజుకు చేరుకున్నాయి.. ఇవాళ కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మిగా దర్శనం ఇస్తున్నారు.. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మి దేవి… జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టంగా చెబుతారు.. మూడు శక్తుల్లో ఒక శక్తి అయినా శ్రీ…
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నడ్డాకు పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత ప్రసాదం, చిత్రపటాని ఆయనకు అందజేశారు. ఎప్పటినుంచో జగన్మాత కనకదుర్గమ్మ దర్శనానికి రావాలని అనుకున్నానని.. ఇప్పటికి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. దుర్గమ్మ కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో మంచి పాలన అందాలని కోరుకున్నారు. KA PAUL:…
నిన్నటి రోజున తిరుపతిలో జన ఆశీర్వాదసభకు హాజరైన కిషన్ రెడ్డి ఆ సభ తరువాత ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నం కిషన్ రెడ్డి విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని సందర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం చేసుకొని కారు ఎక్కుతుండగా కారు డోర్ తగలడంతో ఆయన తలకు స్వల్పగాయం అయింది. స్వల్పమైన గాయమేనని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు పేర్కొన్నారు.…