బెజవాడ దుర్గమ్మకు శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలను అందజేశారు. శ్రీకాళహస్తి ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ మర్యాదలతో దుర్గగుడి ఈవో కె.ఎస్.రామారావు స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి ఆలయ ఈవో బృందానికి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు.
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది.. అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడే పనే లేదు అని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సూచనతో పాలక మండలి కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సకుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్పీకర్‌కు ఆలయ ఈఓ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనాననంతరం చంద్రబాబు దంపతులకు పట్టువస్త్రాలు, అమ్మవారి ప్రసాదం అందించి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.
దేవి నవరాత్రులకు దుర్గ గుడికి ప్రాముఖ్యత ఉందని స్వామి స్వరూపానంద తెలిపారు. చుట్టూ ఉన్న పక్క రాష్టాల నుంచి తండోపతండాలుగా భక్తులు వస్తారని ఆయన పేర్కొన్నారు.
Off The Record: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో ప్రతి వ్యవహారం మంత్రి వర్సెస్ మాజీ మంత్రి అన్నట్టుగానే తయారవుతోంది. దుర్గగుడిలో ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ వర్గపోరు తాజాగా ఉద్యోగి నగేష్ అరెస్టుతో తెరమీదకు వచ్చింది. సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న వాసా నగేష్‌ను ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇటీవల ఏసీబీ అరెస్టు చేసింది. గతంలో ద్వారకా తిరుమలలో ఉద్యోగం చేసినపుడు కూడా నగేష్ పై పలు ఫిర్యాదులు వచ్చి శాఖాపరమైన చర్యలు తీసుకున్న చరిత్ర ఉంది. అలాంటి…