దసరా ఉత్సవాల్లో రెండవ రోజున కనక దుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం, ధరించి దర్శనమిస్తుంది. గాయత్రీ ఉపాసానతో మంత్రసిద్ధి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి. గాయత్రీ మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది.
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గ అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి దర్శించుకున్నారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారి ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించే ఊరేగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి సహజ స్వరూపం కూడా ఇదే.. సింహవాహనాన్ని అధిష్ఠించి, ఆయుధాలను ధరించిన చండీదేవి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా కనకదుర్గదేవీ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. అయితే, అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల నుంచి మహిషాసుర మర్ధిని అవతారంలో, 2 గంటల నుంచీ రాజరాజేశ్వరీ దేవి అవతారంలోనూ దర్శనం ఇస్తారు.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారిని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దర్శించుకుని ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్ధానం పంచాంగంను మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. సీఎం జగన్ ఎంతో సంతోషంగా అమ్మవారిని దర్శించుకున్నారు అని ఆయన పేర్కొన్నారు.
మూలా నక్షత్రం కానున్న నేపథ్యంలో కనక దుర్గ అమ్మవారిని.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం పర్యటన అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.