𝗦𝗥𝗜 𝗚𝗔𝗬𝗔𝗧𝗥𝗜 𝗗𝗘𝗩𝗜 𝗔𝗹𝗮𝗻𝗸𝗮𝗿𝗮𝗺: ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. వివిధ రూపాల్లో దర్శనం ఇస్తున్న కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలు తరలివస్తున్నారు.. ఇక, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజుకు చేరుకోగా.. రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.. పంచముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది.. దీంతో.. గాయత్రి దేవి గా దర్శనం ఇస్తున్న అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరారు.. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా విద్రుమ హేమనీల దవళవర్ణాలతో గాయత్రీ దేవి ప్రకాశిస్తుంది.. శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖ యందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్త్యాంశంగా గాయత్రీ దేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు.. గాయత్రీ దేవి ని దర్శించుకుంటే సకల మంత్ర సిద్ధి ఫలం పొందుతారని భక్తుల విశ్వాసం..
Read Also: Kunja Satyavathi Dies: తెలంగాణ బీజేపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూత!
ఇక, శ్రీశైలంలో 2వ రోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.. సాయంత్రం బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి దర్శనం ఇవ్వనున్నారు.. మయూరవాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్న శ్రీస్వామి, అమ్మవారు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో ఆదిదంపతుల గ్రామోత్సవం నిర్వహిస్తారు. మరోవైపు.. భద్రాద్రిలో నేటినుండి దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.. నవరాత్రుల్లో భాగంగా నేడు సంతాన లక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు అమ్మవారు. శ్రీ దేవి నవరాత్రుల సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో రెండవ రోజు బ్రహ్మచారిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారు.. అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రెండవ రోజు బ్రహ్మచారిని దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు జోగులాంబ అమ్మవారు.. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతుండగా.. రెండవ రోజు బ్రహ్మచారిని అవతారం లో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు.. కాళేశ్వరంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజుకు చేరగా.. బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ శుభానంద, సరస్వతీ దేవి అమ్మవారు.