Kamareddy: కామారెడ్డిలో బీజేపీ ఘన విజయం సాధించింది. రాష్ట్ర ప్రజలే కాకుండా, దేశం మొత్తం కామారెడ్డి నియోజకవర్గంపై ఆసక్తి కనబర్చాయి. సీఎం కేసీఆర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థిగా చెప్పబడుతున్న రేవంత్ రెడ్డిని బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి ఓడించారు. ముందు నుంచి అనుకుంటున్నట్లుగా ఈ సీటులో హోరాహోరీ పోరు జరిగింది. క్షణక్షణానికి, రౌండ్ రౌండ్‌కి ఆధిక్యం మూడు పార్టీల మధ్య మారుతూ వచ్చింది. చివరకు కామారెడ్డి ఓటర్ స్థానిక అభ్యర్థికే పట్టం కట్టారు. ఇద్దరు…
కామారెడ్డిలో హోరాహోరీ పోరు జరుగుతుంది. కామారెడ్డిలో 14వ రౌండ్ ముగిసేసరికి 2,100 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ముందంజలోకి వచ్చారు.. రెండో స్థానంలో రేవంత్‌రెడ్డి, మూడోస్థానంలో కేసీఆర్ కొనసాగుతున్నారు.
Telangana Elections: కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలింగ్ బూత్ ఎదుటే ధర్నాకు దిగారు. పలు పోలింగ్ కేంద్రాల్లోకి స్థానికేతరుడైన రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి చొరబడి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని వారు ఆరోపించారు.
Revanth Reddy: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. ప్రతి రోజూ నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం, రోడ్ షోలు కొనసాగుతున్నాయి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తెలంగాణలో మూడు రోజులు పర్యటించనున్నారు. అందులో భాగంగానే.. కామారెడ్డిలో ప్రచారం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగిపోయారని.. ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ నుండి విముక్తి కోరుతున్నారని తెలిపారు. ఈసారి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని మోదీ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ విధానాలు ఉన్నాయన్నారు. తాను ఇచ్చే మాటలే గ్యారంటీ అని అన్నారు. దేశానికి…
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలోని పెద్ద మల్లారెడ్డిలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. టీపీసీసీ ఛైర్మన్ రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీలు తెలంగాణ కరెంట్‌పై చేసిన కామెంట్స్‌కి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీలు విద్యుత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు ఉండేవన్నారు. కామారెడ్డిలో పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో విద్యుత్ తీగలు…
నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. అక్కడ చిన్నమల్లారెడ్డి, రాజంపేట, బిక్నూర్ కార్నర్ మీటింగుల్లో ఆయన పాల్గొననున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకూ పెరిగిపోతుంది. ఈ సందర్భంగా ఇవాళ స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట, కామారెడ్డి నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
కామారెడ్డిలో నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. రేవంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొనున్నారు.