ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్ ఇప్పుడు దేశంలోనూ విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు గుర్తించారు. ఆ వ్యక్తి ఈ నెల 6వ తేదీన కువైట్ నుంచి ఇండియాకు వచ్చినట్లు తెలిసింది. 40 ఏండ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉండడంతో, అతన్ని హైదరాబాద్‌లోని ఫీవర్ హాస్పిటల్‌కు…
ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వానాలు కురుస్తూనే ఉన్నాయి. కామాారెడ్డి, నిర్మల్, బైంసా పట్టణాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. నిర్మల్ లో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల ప్రభావితమైన నిర్మల్ పట్టణంలోని శాస్తి నగర్, శాంతి నగర్, మంచిర్యాల…
మానవత్వం నసిస్తోంది. మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. అక్రమ సంబంధాలతో ఏడడుగులు నడిచిన సంబందాలను సైతం హత్య చేసేందుకు వెనుకడాటం లేదు. శరీరక సుఖమో లేక తెలిసిపోతుందనే భయమో ఒక్క ఓనం కూడా ఆలోచించకుండా పండెంటి కాపురాన్ని సర్వనాసనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈఘటన సంచలనంగా మారింది. read also: Drivers License: గుడ్ న్యూస్.. ఆర్డీవో ఆఫీసుకి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్.. ! కార్ణాటక కు చెందిన…
పని భారం, అధికారుల వేధింపులు భరించలేక ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన బండి స్వామి గౌడ్ (35) కామారెడ్డి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఇంటి వద్దనే ఉన్నాడు. విధులకు హాజరు కావాలని ఆర్టీసీ అధికారులు తరచూ ఫోను ద్వారా స్వామికి సమాచారం అందిస్తున్నారు. విధులకు రాకపోతే…
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో నేతల మధ్య వర్గపోరు.. అధిష్ఠానానికి తలనొప్పిగా మారిందట. కాంగ్రెస్ ఐటీ సెల్ ఛైర్మన్ మదన్ మోహన్‌రావు.. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. కార్యకర్తలు, నాయకులు రెండువర్గాలుగా విడిపోయారు. పార్టీ ఏదైనా కార్యక్రమాలకు పిలుపిస్తే.. ఎవరి దుకాణం వాళ్లదే. జహీరాబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్‌గా ఉన్న మదన్‌మోహన్ ఎల్లారెడ్డి అసెంబ్లీపై కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకంగా ఒకవర్గాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీతో సంబంధం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట.…
పరీక్షలు రాసే పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. May 23 నుంచి పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండనున్నట్టు ఆర్టీసీ వెల్లడించింది. ఉచితంగా ప్రయాణించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా.. తమ హాల్ టికెట్లను కండక్టర్లకు చూపించాలని పేర్కొన్నారు. విద్యార్థులు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ తరఫున ఈ సౌలభ్యం కలిగిస్తున్నట్టు తెలిపిన ప్రకటన.. ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా ..…
జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక చోట బస్సు, బైక్, ఆటో, ట్రాక్టర్ లతో ప్రమాదాలు చోటు చేసుకుంటూనే వున్నాయి. దీంతో.. అధికంగా ప్రాణనష్టం జరుగుతుండడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బస్సు .. ఒకరికి ఢీ కొట్టడంతో ఆవ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన కామారెడ్డి…
కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలం కోనాపూర్ లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. అనంతరం కోనాపూర్‌లో నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థంగా నిర్మించే స్కూల్ బిల్డింగ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. పలు ఆసక్తికర విషయాలను కేటీఆర్ సభా వేదికగా వెల్లడించారు. మానేరు ప్రాజెక్టుకు మాకు అవినాభావ సంబంధం ఉందని అన్నారు. ఈ అనుబంధం గురించి తెలియజేసేందుకు కేటీఆర్ తమ పూర్వీకుల కథ చెప్పుకొచ్చారు. నానమ్మ ఊరు అప్పర్…
కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. కుటుంబ సభ్యుడు మరణించడంతో దశదిన కర్మలో భాగంగా అంగడి దింపుడు కార్యక్రమానికి ఎల్లారెడ్డి పట్టణం సంతకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా హాసన్ పల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడంతో పాటు మరో 14మంది గాయపడ్డారు.…