మానవత్వం నసిస్తోంది. మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. అక్రమ సంబంధాలతో ఏడడుగులు నడిచిన సంబందాలను సైతం హత్య చేసేందుకు వెనుకడాటం లేదు. శరీరక సుఖమో లేక తెలిసిపోతుందనే భయమో ఒక్క ఓనం కూడా ఆలోచించకుండా పండెంటి కాపురాన్ని సర్వనాసనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈఘటన సంచలనంగా మారింది.
read also: Drivers License: గుడ్ న్యూస్.. ఆర్డీవో ఆఫీసుకి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్.. !
కార్ణాటక కు చెందిన రమేష్ అనే యువకుడు తన భార్యతో కలిసి ఎల్లారెడ్డి పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్న భవనంలో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. అయితే గతంలో వికారాబాద్ లో వాచ్మెన్ గా పనిచేసేవాడు. ఈనేపథ్యంలో వికారాబాద్ పట్టణానికి చెందిన దస్తప్పాతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో.. వారి కుటుంబంలో గొడవలకు దారితీయడంతో.. రమేష్ తన కుటుంబాన్ని కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణానికి మార్చాడు. అయినాకూడా రమేష్ భార్య తన ప్రవర్తన మార్చుకోలేదు. ఆవిషయంలో రమేష్ భార్యను హెచ్చరించాడు. తన ఆగడాలు కొనసాగలంటే భర్త అడ్డువుండటంతో ప్రియుడుతో భర్తను హత్యచేసేందుకు ప్లాన్ వేసింది. ప్రియుడు దస్తప్పతో కలిసి ఎనిమిది రోజుల క్రితం తన భర్త రమేష్ ను గొంతు నులిమి హత్య చేసి అదే ఇంట్లో పూడ్చిపెట్టి అనుమానం రాకుండా రమేష్ భార్య కర్ణాటకకు వెళ్లింది. అక్కడ బంధువులు రమేష్ గురించి అడుగగా పొంతలేని సమాధానం చెప్పడంతో.. బంధువులు పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్సై గణేష్ కాల్ డేటా ద్వారా రమేష్ భార్యను,దస్తప్పను అదుపులో తీసుకుని,ఇంట్లోనే పూడ్చిపెట్టిన రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.
Chintamaneni Prabhakar : కోడిపందాలు అంటే నాకు చిన్నప్పటినుంచి వ్యసనం..