కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు అగ్రనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది. ఈ యాత్రలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ సహా పలువురు రాష్ట్ర నేతలు యాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలోని 'భారత్ జోడో యాత్ర'ను నవంబర్ 28న ఖాల్సా స్టేడియంలో షెడ్యూల్ చేస్తే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో బాంబు పేలుళ్లు జరుగుతాయని అజ్ఞాత లేఖ రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
Congress President Elections: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక పోటీలో ఎవరెవ్వరు ఉంటారనేదానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ సారి కాంగ్రెస్ అధ్యక్ష పదవి దూరంగా ఉండాలని గాంధీ కుటుంబం భావిస్తోంది. ఎన్నికల్లో కలుగచేసుకోవద్దని.. అర్హత ఉన్నవారు పదవికి పోటీ చేయాలని గాంధీ కుటుంబం పార్టీ నేతలకు చెబుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై రాహుల్ గాంధీ మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాను పోటీలో ఉండటం లేదని.. ఇప్పటికే ఈ విషయాన్ని చాలా…