సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్‌హాసన్లను ఒకే తెరపై చూడాలని తమిళ తంబీలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆ కలయిక ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మొదట, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ, రజనీకాంత్ ‘కూలీ’ సినిమా ఫ్లాప్‌తో ఈ క్రేజీ కాంబినేషన్‌కు బ్రేక్ పడిందని వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు నిరాశ చెందారు. Also Read…