Rajinikanth–Kamal Haasan Movie: రజనీకాంత్, కమల్‌హాసన్ మల్టీస్టారర్ లేనట్టే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్‌హాసన్లను ఒకే తెరపై చూడాలని తమిళ తంబీలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆ కలయిక ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మొదట, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ, రజనీకాంత్ ‘కూలీ’ సినిమా ఫ్లాప్‌తో ఈ క్రేజీ కాంబినేషన్‌కు బ్రేక్ పడిందని వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు నిరాశ చెందారు.
Also Read :TRIVIKRAM : తినడానికి తిండిలేక సునీల్.. త్రివిక్రమ్ ఏం చేశాడంటే..
Also Read
ఈ మధ్యే మరో కొత్త విషయం తెరపైకి వచ్చింది. యువ దర్శకుడు కమ్ హీరో అయిన ప్రదీప్ రంగనాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. ప్రదీప్ ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ వంటి హిట్ సినిమాలతో తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే, ప్రదీప్ రంగనాథ్ తన తాజా చిత్రం ‘డూడ్’ ప్రమోషన్‌లో ఈ పుకార్లపై స్పష్టత ఇచ్చాడు. “నా దృష్టంతా ప్రస్తుతం యాక్టింగ్ పైనే ఉంది. రజనీకాంత్, కమల్‌హాసన్ల సినిమాకు నేను డైరెక్టర్‌ని కాదు,” అని తేల్చి చెప్పాడు.
ప్రదీప్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో, రజనీ-కమల్ కాంబినేషన్ మళ్లీ అటకెక్కినట్టైంది. అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ కలయిక ఇప్పట్లో ఉండకపోవచ్చని స్పష్టమైంది. ప్రదీప్ రంగనాథ్ నటించిన ‘డూడ్’ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!