విలక్షణమైన అభినయానికి నిలువెత్తు నిదర్శనం కమల్ హాసన్. కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా కమల్ అభినయాన్ని అభిమానించేవారి సంఖ్య లెక్కలేనిది. ఆరు పదులు దాటి అర్ధపుష్కరమైనా, ఇప్పటికీ కమల్ హాసన్ లో మునుపటి ఉత్సాహం, అదే తపన, ఎప్పటిలా ఓ విద్యార్థిలా నేర్చుకోవడం అన్నవి కొనసాగుతూనే ఉన్నాయి. తమిళనాట జన్మించి, అక్కడ స్టార్ హీరోగా రాజ్యమేలినా, తెలుగునేలపైనే కమల్ కు అత్యధిక సంఖ్యలో అభిమానులున్నారని చెప్పవచ్చు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా మూడు సార్లు నిలచిన తొలి…