ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పుష్పక విమానం’. ‘దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్’ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన మూడో చిత్రమిది. దామోదరను దర్శకుడిగా పరిచయం చేస్తూ గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ రిషి, ప్రదీప్ ఎర్రబెల్లి దీనిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘పుష్పక విమానం’లో శాన్వి మేఘన, గీత్ సాయిని హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత…