కేబినెట్‌లో కొత్తగా చోటు దక్కించుకున్న ఉషశ్రీచరణ్‌కు.. ఎంపీ తలారి రంగయ్య మధ్య మూడేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరి మధ్య వైరం పీక్స్‌కు చేరుకుంది. ఉషశ్రీచరణ్ ప్రస్తుతం మంత్రి అయినా.. ఎంపీ తగ్గేదే లేదన్నట్టుగా ముందుకెళ్తున్నారు. మంత్రి పదవి చేపట్టాక జిల్లాకు వచ్చిన ఉషశ్రీచరణ్.. జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలందరినీ కలిసి మాట్లాడుతున్నారు. కానీ.. ఎంపీని మాత్రం పలకరించలేదు. మూడేళ్లుగా ఉన్న వైరానికే ఇద్దరూ ప్రాధాన్యం ఇస్తుండటం పార్టీలో చర్చగా మారుతోంది. కల్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఉషశ్రీచరణ్‌ది కురుబ…