ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ను స్థాపించి 2005 నుండి పలు చిత్రాలను నిర్మిస్తూ, నటిస్తున్నాడు నందమూరి హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్. అంతేకాదు… తన తమ్ముడు ఎన్టీఆర్ తోనూ ఆ బ్యానర్ లో ‘జైలవకుశ’ చిత్రాన్ని నిర్మించాడు. త్వరలో తెరకెక్కబోతున్న ఎన్టీయార్ – కొరటాల శివ చిత్రానికి, ఆ తర్వాత వచ్చే ఎన్టీయార్ – తివిక్రమ్ సినిమాలకు కూడా కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడు. ఇదే సమయంలో నటుడిగానూ కళ్యాణ్ రామ్ ఇప్పుడు వేగం పెంచాడు. 2020లో…
రచయిత అనిల్ రావిపూడిలోని ప్రతిభను గుర్తించిన నందమూరి కళ్యాణ్ రామ్ అతన్ని ‘పటాస్’ మూవీతో దర్శకుడిని చేశారు. ఆ సినిమా చక్కని విజయం సాధించడంతో ఇక అనిల్ రావిపూడి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అలానే నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని అయిన అనిల్ రావిపూడి, ఆయనతో సినిమా చేసే ఛాన్స్ కోసం కొంతకాలంగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఆ అవకాశం రానే వచ్చింది. బాలయ్య – అనిల్ కాంబినేషన్ లో మూవీకి…