సినిమా రంగం ఎంత వాణిజ్యపరమైనది అయినా... ఆపన్నులను ఆదుకునే మంచి మనస్కులు సైతం ఆ రంగంలో ఉన్నారు. తాజాగా ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్. థాను అదే ఉదారతను చాటుకున్నారు.
విక్టరీ వెంకటేశ్, ప్రియమణి కీలక పాత్రలు పోషించిన ‘నారప్ప’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ‘ఈ సినిమాను మే 14న థియేటర్లలోనే విడుదల చేయాలని అనుకున్నామని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నామ’ని ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన కలైపులి ఎస్. థాను చెప్పారు. 17 సంవత్సరాల క్రితం 2004లో వెంకటేశ్ తో ‘ఘర్షణ’ చిత్రం తెలుగులో తీసిన ఆయన మళ్లీ ఇంతకాలానికి ‘నారప్ప’ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ‘సురేశ్…