కాకినాడ తీరంలో అగ్నిప్రమాదం జరిగింది. సముద్రంలో వేటకు వెళ్తున్న మత్య్సకారుల బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు బోటు మొత్తం అంటుకున్నాయి. దీంతో మత్య్సకారులు లైఫ్ జాకెట్లు ధరించి సముద్రంలోకి దూకేశారు. ఇక, విషయం తెలుసుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి రెస్యూ ఆపరేషన్ నిర్వహించారు. సముద్రంలో కొట్టుకుపోతున్న 11 మందిని కోస్ట్ గార్డ్ సిబ్బంది సురక్షింతంగా ఒడ్డుకు చేర్చారు. లైఫ్ జాకెట్లు ధరించడం, కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి రెస్యూ ఆపరేషన్ చేయడంతో మత్య్సకారులకు ప్రాణ ముప్పు తప్పింది. దీంతో వారు అందరు ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: Strong Rooms: స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు..
అయితే, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల ప్రాంతంలో బోటు ప్రమాదం చోటు చేసుకుంది. బోటు ఇంజిన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా బోటు ముందు భాగంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిపారు. అయితే, బోటు ముందు భాగంలో అగ్నికీలలు పూర్తిగా వ్యాపించడంతో.. వెనుకభాగం అంతా పూర్తిగా పొగలు వ్యాపించాయి.. అయితే, మత్స్యకారులు వేటకు వెళ్లే సమయంలో.. భోజనం వండుకొనేందుకు అవసరమైన సరుకులతో పాటు గ్యాస్ సిలిండర్ ను తీసుకెళ్తారు. ఆ సిలిండర్ బోటులో పేలడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం.