హీరో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కోడి రామకృష్ణ, భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ .గోపాల్ రెడ్డి కలసి ‘మువ్వగోపాలుడు’తో హ్యాట్రిక్ సాధించారు. అంతకు ముందు ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన ‘మంగమ్మగారి మనవడు’ 560 రోజులు, ‘ముద్దుల క్రిష్ణయ్య’ 365 రోజులు ప్రదర్శితమై రికార్డు సృష్టించాయి. వీరి కలయికలో వచ్చిన మూడో చిత్రం ‘మువ్వగోపాలుడు’ సైతం 300 రోజులు ప్రదర్శితమయింది. ఇలా వరుసగా ముగ్గురు కలసి మూడు త్రిశతదినోత్సవాలు చూసిన ఘనత అప్పటి దాకా ఎవరికీ లేదు.…
కాలం మారుతున్నా కట్నకానుకల ఊసు కరగిపోవడం లేదు. ఒకప్పుడు ‘కన్యాశుల్కం’, ఆ పైన ‘వరకట్నం’ అన్న దురాచారాలు జనాన్ని కుదిపేశాయి. వీటిని నిరసిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం అనేక చిత్రాలు వెలుగు చూశాయి. గురజాడ సుప్రసిద్ధ నాటకం ఆధారంగా తెరకెక్కిన పి.పులయ్య ‘కన్యాశుల్కం’, యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘వరకట్నం’ ఆ కోవకు చెందిన చిత్రాలే! కె.విశ్వనాథ్ కూడా 40 ఏళ్ళ క్రితం ఆ దిశగా పయనిస్తూ రూపొందించిన చిత్రం ‘శుభలేఖ’. అప్పట్లో వర్ధమాన…
తెలుగు చలన చిత్రసీమలో పలు అరుదైన రికార్డులు నమోదు చేసిన ఘనత నటరత్న యన్.టి.రామారావు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ కే దక్కుతుంది. యన్టీఆర్ తో రాఘవేంద్రరావు తొలిసారి తెరకెక్కించిన చిత్రం ‘అడవిరాముడు’. ఈ చిత్రంలో అనుసరించిన ఫార్ములాను ఇప్పటికీ తెలుగు సినిమా అనుసరిస్తూనే ఉండడం విశేషం! దర్శకత్వంలో రాణించాలనుకొనేవారికి పూర్తిగా అడవిలో రూపొందిన ‘అడవిరాముడు’ చిత్రం ఓ అధ్యయన అంశమనే చెప్పవచ్చు. ఈ చిత్రం విడుదలై నలభై ఐదేళ్ళు అవుతున్నా, ఇంకా ‘అడవిరాముడు’ ఫార్ములానే అనుసరిస్తున్నవారెందరో ఉన్నారు.…