కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ ఎవిన్యూ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పును కోర్టు మే 6 కు రిజర్వ్ చేసింది. ఈడీ తరపున జోయాబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. కవిత తరపు న్యాయవాది నితీష్ రానా ఈడీ వాదనలపై ఎల్లుండి లిఖితపూర్వకంగా తమ రిజాయిండర్ ఇస్తామని కోర్టుకు తెలిపారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని కోర్టు పొడగించింది. మరో 14 రోజుల పాటు అతను జైలులోనే ఉండాలి.
MLC Kavitha: ఏప్రిల్ 9 వరకు ఎమ్మెల్సీ కవితకు స్పెషల్ కోర్ట్ జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. కవిత మధ్యంతర బెయిలుపై ఒకటో తేదీన విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో కవితను అధికారులు జైలుకు తరలిస్తున్నారు.
Delhi Liquor Scam : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దక్షిణాదితో ఉన్న సంబంధం వెలుగులోకి వచ్చింది. దీంతో వివరణాత్మక సమాచారం కోసం ఈడీ అరవింద్ కేజ్రీవాల్, కె. కవితను ముఖాముఖిగా కూర్చోబెట్టి విచారించాల్సిన అవసరం ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కవితతో పాటు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ తో కలిసి శనివారం అర్థరాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు.