కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంప్రదాయ భారతీయ గేమ్ 'చిర్రగోనె' ఆడారు. అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. కాగా.. సింధియా చిర్రగోనె ఆడటం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా.. ఆ ఆట ఆడుతున్న వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. చాలాసార్లు క్రికెట్ ఆడానని.. కానీ, ఈ ఆట ఆడటం చాలా సరదాగా ఉందని తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, జిల్లా అధికార ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కి కేంద్ర మంత్రి జ్యోతి రాదిత్య సింధియా హజరయ్యారు. ఈ సందర్భంగా పలు జిల్లాల బీజేపీ అధ్యక్షుల మార్పులు జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. పదేళ్లలో మోడీ నేతృత్వంలో సివిల్ ఏవియేషన్ లో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. సామాన్య వ్యక్తి విమానాల్లో ప్రయాణిస్తున్నాడని, 76 కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించామన్నారు. అంతేకాకుండా.. 570…
అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక ఎయిర్ క్రాఫ్ట్‌లను కొనుగోలు చేస్తోందని.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎంతో ముందుకు దూసుకుపోతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. సాధారణ పౌరుడికి సైతం విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రధాని సంకల్పించారని, ఆ దిశగా సరలీకరిస్తున్నామని జ్యోతిరాదిత్య తెలిపారు. బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో ‘ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా 2024’ వైమానిక ప్రదర్శనను గురువారం ఆయన ఆరంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు.…
బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో ‘ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా 2024’ వైమానిక ప్రదర్శన ప్రారంభం అయింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆరంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏవియేషన్ రంగనిపుణులు పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు వింగ్స్ ఇండియా 2024 జరగనుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.…
Flight Delay: పొగమంచు, వాతావరణ పరిస్థితులు దేశంలో విమానయానాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి ఢిల్లీలో పొగమంచు పరిస్థితులు వందల సంఖ్యలో విమానాల రాకకు అంతరాయాన్ని కలిగించాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా అవస్థలు పడ్డారు. ఏకంగా కొందరు ప్రయాణికలు విమాన సిబ్బందిపై దాడులు చేయడమే చేయడం, ప్రయాణికులు విమానం పక్కనే నేలపై కూర్చుని భోజనం చేయడం వైరల్‌గా మారాయి.
Flight delay: పొగమంచు కారణంగా ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో విమానాల కార్యకలాపాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. గంటల కొద్దీ ప్రయాణికులు విమానాల్లోనే చిక్కుకుపోయారు. ప్రయాణికుల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఇండిగో విమానంలో ఫ్లైట్ డిలే అవుతుందని ప్రకటించిన కెప్టెన్‌పై ప్రయాణికుడు అసహనంతో దాడి చేశాడు. ఈ ఘటనపై కేంద్రం విమానయాన శాఖ మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దాదాపుగా 100 విమానాలు ఆలస్యమయ్యాయి. చాలా మంది ప్రయాణికులు…
Congress: కాంగ్రెస్ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 2019 నుంచి ఆ పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్తూనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్రలో కీలక నేత, కాంగ్రెస్‌తో 50 ఏళ్లుగా అనుబంధం ఉన్న కుటుంబంలోని సీనియర్ నేత మిలింద్ దేవరా కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ మొదలుపెట్టే రోజు ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శ్రీకారం చుట్టారు. రాజమండ్రి విమానాశ్రయ టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు.
కాంగ్రెస్ ఎంపీ, అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ హయాంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా అని ప్రశ్నించారు.