Israel-Hamas War: గాజాలో హమాస్ ఉగ్రసంస్థను తుడిచిపెట్టేలా ఇజ్రాయిల్ దాడులు నిర్వహిస్తోంది. భూతలదాడుల్లో హమాస్ ఉగ్రవాదలను హతమారుస్తోంది. హమాస్ ఉగ్రసంస్థకు కేంద్రాలుగా ఆస్పత్రులను ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిఫా ఆస్పత్రిని ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది. ఈ ఆస్పత్రి కిందనే హమాస్ కమాండ్ సెంటర్ తో పాటు కీలక ఉగ్రవాదులు ఉన్నట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది.
Justin Trudeau: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీస్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా దేశాల మధ్య తీవ్ర దౌత్య వివాదానికి కారణమైంది. ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నాయి. తమ పౌరుడైన నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడ ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పడం వివాదాస్పదం అయింది. అంతే కాకుండా కెనడాలోని భారత సీనియర్ దౌత్యవేత్తను ఆ దేశం బహిష్కరించింది. దీనికి తీవ్రంగా స్పందించిన భారత్, కెనడియన్ దౌత్యవేత్తను దేశం…
India-Canada: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై అక్కడి ప్రజలు, ప్రతిపక్ష నేతలు తీవ్ర అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. ఇప్పటికే కెనడా ‘హౌసింగ్ సంక్షోభం’లో కూరుకుపోయింది. అక్కడి ప్రజలకు ఉండటానికి ఇళ్లు దొరకని పరిస్థితి ఉంది. మరోవైపు ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్లకు కెనడా స్వర్గధామంగా మారింది. రాజకీయ కారణాల వల్ల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతుగా నిలుస్తున్నారు. దీని కారణంగా కెనడా-ఇండియాల మధ్య దౌత్య వివాదం రగులుతోంది.
Justin Trudeau: కెనడా, ఇండియాల మధ్య దౌత్య వివాదం తీవ్రమవుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య రెండు దేశాల మధ్య వివాదంగా మారింది. ఇదిలా ఉంటే మరోసారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా దౌత్యవేత్తలపై భారత ప్రభుత్వం అణిచివేతతో రెండు దేశాల్లోని లక్షలాది మంది ప్రజల సాధారణ జీవితాన్ని కష్టతరం చేస్తోందని ప్రధాని జస్టిన్ ట్రూడో శుక్రవారం అన్నారు.
‘‘నవరాత్రి శుభాకాంక్షలు! హిందూ సమాజంలోని సభ్యులకు మరియు ఈ పండుగను జరుపుకుంటున్న వారందరికీ నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అంటూ ఎక్స్(ట్విట్టర్)లో ట్రూడో పోస్ట్ చేశారు.
Justin Trudeau: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్య విషయంలో భారత్‌పై అనవసర ఆరోపణలు చేసి దౌత్య సంబంధాలను దెబ్బతిన్నాకున్నాడు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. ఇప్పటికే భారత ఆగ్రహం చవిచూసిన ట్రూడో, అక్కడి స్థానికుల నుంచి కూడా మద్దతు కోల్పోతున్నాడు. తాజాగా ఓ కెనడియన్, ప్రధానిని అందరి ముందు తిట్టాడు, కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా ఇష్టపడలేదు. దేశంలో హౌసింగ్ సంక్షోభం, కార్బన్ పన్నులపై ప్రశ్నించాడు.
కెనడా భారత్‌తో పరిస్థితిని పెంచడానికి చూడటం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మంగళవారం అన్నారు. కెనడా భారత్‌తో బాధ్యతాయుతంగా, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు.
భారత్- కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కఠినమైన వైఖరిని తీసుకున్న భారత్.. కెనడా తన 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించాలని కోరింది.
Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోపణల్ని ‘చైల్డిష్’గా అక్కడి భారతీయ సంఘాలు కొట్టిపారేశాయి
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు సూడాన్ భారత మాజీ రాయబారి దీపక్ వోహ్రా. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కెనడా ప్రధానికి సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించారు. ఇటీవల జరిగిన జీ20 సమావేశానికి ఢిల్లీ వచ్చిన జస్టిన్ ట్రూడో విమానంలో కొకైన్ ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం అని ఆయన వెల్లడించారు. భారత స్నిఫర్ డాగ్స్ ఆయన విమానంలో డ్రగ్స్ గుర్తించాయని ఆయన పేర్కొ్న్నారు. అంతేకాదు కొకైన్ కారణంగా అతడు రెండు…