India Canada: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి సంబంధించిన ఇద్దరు ఉన్నతాధికారులు భారతదేశం గురించి రహస్య సమాచారాన్ని, కెనడాలో భారత జోక్యంపై అమెరికా వార్తాపత్రికతో పంచుకున్నారు. కెనడా జాతీయ భద్రతా సలహాదారు నథాలీ డ్రౌయిన్ అమెరికా మీడియాకు తెలియజేసినట్లు కెనడా మంగళవారం నివేదించింది. కెనడియన్ ఫెడరల్ పోలీసులు ఆరోపించిన కొన్ని రోజులుకు ముందే సమాచారాన్ని అందించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
India-Canada Relations: భారత్, కెనడా దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలను ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో నాశనం చేస్తున్నారని కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ ఆరోపించారు.
కెనడాలో ఉన్న మిగిలిన దౌత్యవేత్తలపై తాము ప్రత్యేక నిఘా ఉంచామంటూ భారత్‌పై బురద జల్లే ప్రక్రియను ఆమె కొనసాగించారు. అంతటితో ఆగకుండా భారత్‌ను రష్యాతో పోలుస్తూ అక్కసును వెళ్లగక్కింది. భారత దౌత్య వేత్తలు వియన్నా కన్వెన్షన్ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడితే సహించేది లేదని మెలానీ జోలీ కామెంట్స్ చేసింది.
భారత్, కెనడాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కెనడాలో సిక్కు నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో అక్కడి భారత రాయబారి ప్రమేయం ఉందని ఆ దేశం ఆరోపించింది. ఇందుకు బలమైన ఆధారాలు సమర్పించాలని భారత్ కోరింది. ఇప్పటికే దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఇచ్చేశామంటోంది కెనడా. అసలు కెనడాకు, ఇండియాకు మధ్య గ్యాప్ ఎందుకొచ్చిందనే విషయం తెలియాలంటే చరిత్రలోకి వెళ్లాలి.. భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయి. కెనడా దౌత్య సిబ్బందిని భారత్…
ఇదిలా ఉంటే, ఖలిస్తాన్‌కి గట్టి మద్దతుదారు, ట్రూడో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కెనడియన్ సిక్క్ ఎంపీ జగ్మీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టులు ఎగతాళి చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై మీడియా మొత్తం నవ్వుకుంది. భారత రాయబారులు, భారతదేశంపై ఆంక్షలు విధించాలని జగ్మీత్ సింగ్ డిమాండ్ చేశారు
India-Canada Conflict: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాపులారిటీ అక్కడ రోజురోజుకు పడిపోతోంది. మరోవైపు ప్రభుత్వంపై కొందరు ఎంపీలు అసమ్మతి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిన్నింటి పక్కకు తప్పించి, మరోసారి సిక్కులు, సిక్కు ఎంపీల మద్దతు పొందేందుకు ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యని ముందుకు తీసుకువచ్చారు. ఈ కేసులో కెనడాలోని భారత అగ్రశ్రేణి దౌత్యవేత్తల ప్రమేయం ఉన్నట్లు ఆరోపించడంతో ఒక్కసారిగా ఇరు దేశాల మధ్య దౌత్యయుద్ధం మొదలైంది. భారత్ ఇప్పటికే…
భారత్‌పై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ఆ అర్థం వచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్ణయం తీసుకోవడానికి తాము రెడీగా ఉన్నామంటూ రెచ్చగొట్టేలా కెనడా విదేశాంగ మంత్రి జోలీ రియాక్ట్ అయ్యారు.
India-Canada Row: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు అనుమానితుల లిస్టులో ఏకంగా భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మను చేర్చి భారత్ తో కెనడా కయ్యానికి కాలుదువ్వింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును తెర పైకి తెచ్చి భారత్‌పై బురద జల్లే ప్రయత్నం చేసిందన్నారు.
Canada–India Row: లావోస్‌లో నిర్వహించిన భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చర్చలు జరిపినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. దీనిపై భారత్ రియాక్ట్ అయింది. ఇరువురి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసింది.