Canada: ట్రూడో ప్రభుత్వం హిందువులు-సిక్కుల మధ్య విభజన సృష్టిస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోపణల్ని ‘చైల్డిష్’గా అక్కడి భారతీయ సంఘాలు కొట్టిపారేశాయి. ఈ వ్యాఖ్యలకు ఖచ్చితమైన ఆధారాలు ఉండాలన్నారు. కెనడాలో కేవలం ఒకటి రెండు శాతం మంది తీవ్రవాదులు ఉన్నారు, మిగిలిన సిక్కులు వారితో లేరని, వారికి సొంత అభిప్రాయాలు ఉన్నాయని ఇండియన్ కమ్యూనిటీ మెంబర్ అమన్ దీప్ సింగ్ చబ్బా అన్నారు.
ట్రూడో ఖచ్చితమైన ఆధారాలు అందించాలని, లేకుంటే భారత్-కెనడా సంబంధాల్లో విభజనకు దారి తీస్తుందని, ట్రూడో చర్యలు బాధపెట్టాయని అమన్ దీప్ సింగ్ అన్నారు. పెద్ద సమస్యలను కూడా దౌత్యం ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన ఇరు దేశాలకు సూచించారు.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
Read Also: S Jaishankar: “కెనడా తీవ్రవాదానికి ఆశ్రయం ఇస్తోంది”.. అమెరికాకు తేల్చిచెప్పిన జైశంకర్
ట్రూడో ప్రభుత్వం కెనడాలో హిందువులు, సిక్కుల మధ్య విభజన సృష్టిస్తోందని డాక్టర్ రాజ్ జగ్‌పాల్ అన్నారు. ట్రూడో చేస్తున్నది తప్పని, వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కెనడాలో హిందువులు, సిక్కుల మధ్య తేడా లేదని, సమస్యను పరిస్కరించాలని, ప్రభుత్వం ఓట్లు పొందడానికి ఈ విభజన సృష్టస్తోందని ఆరోపించారు. ఇండో కెనడియన్ మంజీర్ బిర్ మాట్లాడుతూ.. ప్రజలు సంతోషంగా ఉండేలా రెండు దేశాల మధ్య శాంతి కొనసాగించాలని ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నామని అన్నారు. కెనడాలో భారతీయ సమాజం ఆందోళన చెందుతోందని చెప్పారు.
జూన్ నెలలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. అయితే అతని హత్య వెనక భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించాడు. దీనికి నమ్మదగిన ఆరోపణలు ఉన్నాయని ఆయన అన్నారు. అయితే ఈ ఆరోపణలపై సాక్ష్యాలు ఇవ్వాల్సిందిగా భారత్ కోరిందని విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల తెలిపారు. అయితే కెనడా నుంచి ఎలాంటి సమాచారం రాలేదని అన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!