Canada : కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లో గత కొన్ని నెలలుగా హిందూ దేవాలయాలపై అనేక దాడులు జరిగాయి. ఈ దాడులు దేశంలో మతపరమైన ఉద్రిక్తతను కూడా పెంచాయి. ఇప్పుడు దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటూ.. కెనడా పోలీసులు 41 ఏళ్ల జగదీష్ పంధర్‌ను అరెస్టు చేశారు. జగదీష్ పంధర్ గ్రేటర్ టొరంటో ఏరియాలోని బ్రాంప్టన్‌లో నివసిస్తున్నాడు. ఆయనపై ఇప్పటికే పలు అభియోగాలపై కేసులు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు. గతేడాది కూడా కొన్ని ప్రార్థనా స్థలాలను టార్గెట్ చేశాడు. అక్టోబరు 8న హిందూ దేవాలయంలోకి ప్రవేశించిన వ్యక్తిని సీసీ కెమెరాల్లో చూసినట్లు పోలీసులు చెబుతున్నారు.
Read Also:Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు!
దీని తరువాత అతను ఆలయాన్ని ధ్వంసం చేసి, అక్కడ ఉంచిన హుండీల నుండి పెద్ద మొత్తంలో నగదుతో ఉడాయించాడు. గుడికి వెళుతున్నట్లు ఫుటేజీలో కనిపించింది. దీని తరువాత విచారణ పురోగతిలో ఒకే వ్యక్తి చాలా దేవాలయాలలో ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డాడని తేలింది. అతను డర్హామ్, గ్రేటర్ టొరంటోలోని అనేక దేవాలయాలలో ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడు. ఈ ఘటనలు దేవాలయాల్లో జరిగినా వాటిని ద్వేషపూరిత నేరాలుగా గానీ, ద్వేషం కారణంగా జరిగిన ఘటనలుగా గానీ చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. సెప్టెంబర్ నుండి అంటారియోలో కనీసం ఆరు దేవాలయాలు దెబ్బతిన్నాయి.
Read Also:PVR INOX: సౌత్ లో రచ్చ రేపే ఆఫర్ తో దిగుతున్న పీవీఆర్.. వింటే సినిమాలకి వెళ్లకుండా ఆగలేరు!
హిందూ సమాజం ఈ అంశాన్ని నిరంతరం లేవనెత్తుతోంది. ఇప్పటివరకు దెబ్బతిన్న ఆలయాలలో పికరింగ్‌లోని దేవి ఆలయం, అజాక్స్‌లోని సంకట్ మోచన్ ఆలయం, ఓషావాలోని హిందూ దేవాలయం ఉన్నాయి. ఇది కాకుండా, గ్రేటర్ టొరంటోలో మూడు దేవాలయాలపై దాడులు జరిగిన సంఘటనలు కూడా నమోదయ్యాయి. అలాంటి కొన్ని సంఘటనలు 2021లో కూడా జరిగాయి. ఇలా మొత్తం 18 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు 2022 మార్చిలో కూడా హిందూ దేవాలయాలపై దాడుల కేసుల్లో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మార్చిలో పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తుల్లో జగదీప్ పందేర్ ఒకరు. దీంతో పాటు గురుశరంజిత్ ధిండా, పర్మీందర్ గిల్, గుర్దీప్ పంధేర్‌లను కూడా అరెస్టు చేశారు. ఈ వ్యక్తులు ఎక్కువగా హిందూ దేవాలయాలను పాడు చేశారు. కానీ జైన దేవాలయాలు, గురుద్వారాలను కూడా ధ్వంసం చేసి దోచుకున్నారు.