లిక్కర్ లో ప్రభుత్వ పాలసీ ఉంటది.. కానీ అనధికార పాలసీ ఉంటదా? అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. "మద్యం అందుబాటులో లేకుంటే సేల్స్ తగ్గాలి. కానీ ఎందుకు పెరిగింది సేల్స్.
వడగళ్ల వానలతో పంటలు దెబ్బ తిన్న రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇవాళ ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎకరానికి 10 వేలు నష్ట పరిహారం అందిస్తామన్నారు. ప్రతి గ్రామానికి అధికారులు వెళ్ళి రైతు వారీగా సర్వే చేస్తున్నారని, ఆ నివేదిక రాగానే రైతుల ఖాతాలకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు మంత్రి జూపల్లి. వచ్చే ఖరీఫ్ నుంచి క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేస్తామని, ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ధనిక…
కేసీఆర్ కృష్ణా నది జలాల కోసం పోరాటం చేస్తాం అని అంటున్నాడు.. తప్పు చేసిన వాడు ఎప్పుడైనా భయపడతారని.. అందుకే కేసీఆర్ భయపడుతున్నాడని వ్యాఖ్యానించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇవాళ ఆయన గాంధీ భవన్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్.. ఇరిగేషన్ మంత్రి ఐదేళ్లు చేశారని, మామా.. అల్లుళ్లు ఇద్దరు ఇరిగేషన్ మంత్రి గా చేశారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోవడం కోసం ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. పునర్విభజన బిల్లు రాసింది నేనే అని…
తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. FITUR పేరుతో ప్రఖ్యాతిగాంచిన స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లోని IFEMAలో జరుగుతున్న అంతర్జాతీయ టూరిజం ట్రేడ్ ఫెయిర్ లో బుధవారం తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్ ను మంత్రి జూపల్లి కృష్ఱారావు ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకైన బోనాలను కనుల పండుగగా…
FITUR పేరుతో ప్రఖ్యాతిగాంచిన స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో జరిగే అంతర్జాతీయ టూరిజం ట్రేడ్ ఫెయిర్లో పాల్గొనేందుకు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ బృందం మాడ్రిడ్ చేరుకుంది. ఈ అంతర్జాతీయ పర్యాటక, వాణిజ్య ప్రదర్శన జనవరి 24 నుంచి జనవరి 28 వరకు మాడ్రిడ్ లోని IFEMAలో జరగనుంది. అంతర్జాతీయ పర్యాటక నిపుణుల వేదిక మాత్రమే కాదు ఈ FITUR ప్రఖ్యాత వాణిజ్య ప్రదర్శన కూడా.…
పరేడ్ గ్రౌండ్లో ఈనెల 13,14,15 కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు ఆబ్కారీ & టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సక్రాంతి పండుగను పురస్కరించుకుని ఫెస్టివల్ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేవిధంగా ఫెస్టివల్ ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు, ప్రపంచంలో నీ చాలా దేశాల నుండి ఫెస్టివల్ లో పాల్గొంటారని తెలిపారు. 15 లక్షల మంది ప్రజలు పాల్గొంటారని అంచనా వేస్తున్నానన్నారు. 400 రకాల…
జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆక్టుకునేలా తెలంగాణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని అబ్కారీ, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బేగంపేట లోనిహరిత ప్లాజా లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్ట్ లు, హరిత హోటల్స్ నిర్వహణ, ఇతర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారామంత్రికి…
కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషా ఓడిపోయారు. నిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఆమె పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉన్నప్పటికీ ఫలితాలలో మాత్రం వెనక్కి పడిపోయారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గెలిచారు.
Jupally Krishna Rao Aggressive Comments On CM KCR: ఎన్నికలు రాగానే తెలంగాణ సీఎం కేసీఆర్ వేషాలు మారుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత జూపల్లి కృష్ణారావు అన్నారు. కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే అని, ఆయన మాట మీద నిలబడే వ్యక్తి కాదన్నారు. కేసీఆర్పై తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయిందని జూపల్లి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తన కాలి గోటికి కూడా సరిపోరని, ఏ విషయంలో తన కంటే గొప్పోడని జూపల్లి మండిపడ్డారు. బీజేపీతో…