వడగళ్ల వానలతో పంటలు దెబ్బ తిన్న రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇవాళ ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎకరానికి 10 వేలు నష్ట పరిహారం అందిస్తామన్నారు. ప్రతి గ్రామానికి అధికారులు వెళ్ళి రైతు వారీగా సర్వే చేస్తున్నారని, ఆ నివేదిక రాగానే రైతుల ఖాతాలకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు మంత్రి జూపల్లి. వచ్చే ఖరీఫ్ నుంచి క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేస్తామని, ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే బీఆర్ఎస్ 8 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ అప్పులు 60 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోంది… దీనికి మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు.
Arvind Kejriwal: కేజ్రీవాల్ నివాసంలో ఈడీ సోదాలు.. అరెస్టుకు రంగం సిద్ధం..?
2 లక్షల రుణ మాఫీ ఒకేసారి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. ఓటమిని జీర్ణించుకోలేక ఎప్పుడు అధికారంలోకి రావాలన్న తపనతో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అని, పార్లమెంట్ ఎన్నికల్లో మహా అయితే ఒక సీటు రావొచ్చు అని ఆయన అన్నారు. ప్రతి రైతును ఆదుకుంటాం.. అధైర్య పడొద్దని భరోసా కల్పించారు. ఇప్పటికే 58.6 లక్షల మంది రైతులకు రైతు భరోసా సొమ్ము అందిందని, వచ్చే వారం రోజుల్లో మిగిలిన రైతులకు కూడా అందుతుందన్నారు.
Crime: ఉద్యోగం వెతుక్కోమని చెప్పినందుకు తండ్రిని హత్య చేసిన కొడుకు..