డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోందనగానే సదరు సినిమాపై ప్రేక్షకుల్లో పలు చర్చలు మొదలవుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అంతటి స్టార్ డమ్ చూసిన డైరెక్టర్ మరొకరు కానరారు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-1’ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకోవడం, రాజమౌళి తరం దర్శకుల్లో ఆయనకు మాత్రమే ‘పద్మ’ పురస్కారం లభించడం ఇత్యాది అంశాలు సైతం రాజమౌళి అనగానే నేషనల్ లెవెల్లో ఆసక్తి కలిగేలా చేస్తున్నాయి. రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ టిక్కెట్…