బీహార్‌లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు వరకు జరగనుంది. ఇదిలా ఉంటే ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్ నమోదైంది. క్రమక్రమంగా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు.
జంగిల్ రాజ్ పాలనలో బీహార్‌లో అభివృద్ధి శూన్యమని.. మళ్లీ ఆ రోజులు ఎవరూ కోరుకోవద్దని ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీహార్‌లో రెండు విడతలో జరిగే నియోజకవర్గాల్లో గురువారం మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్జేడీ నేతృత్వంలోని విపక్ష కూటమిపై విరుచుకుపడ్డారు.
Bihar Elections: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్డీయే, ఇండియా కూటమి పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. రాష్ట్రంలోని 243 స్థానాలకు గానూ రెండు విడతల్లో నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న బీహార్ ఫలితాలు వెలువడనున్నాయి.
PM Modi: బీహార్ ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని నరేంద్రమోడీ దిగారు. బీహార్‌లోని బీజేపీ కార్యకర్తలతో ప్రధాని గురువారం మాట్లాడుతూ.. బీహార్‌లో ‘‘జంగిల్ రాజ్’’ మరో 100 ఏళ్లు అయినా మరిచిపోలేమని, ఆ కాలపు అనుభవానలు యువతరానికి అందించాలని రాష్ట్రంలోని సీనియర్ ఓటర్లను ఆయన కోరారు