పశ్చిమ బెంగాల్‌లో మరోసారి బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య మినీ సంగ్రామం జరగబోతుంది. బుధవారం నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరగనుంది. దీంతో రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.
బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు ఉప ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది.