జూలై 1 నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి రానున్నాయి. 1860లో ఏర్పడిన ఇండియన్ పీనల్ కోడ్ (IPC) స్థానంలో ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ (BNS) వస్తుంది.
భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన బైక్‌లు, స్కూటర్ల ధరలను పెంచబోతోంది. జూలై 1, 2024 నుంచి కంపెనీ ధరలను పెంచనుంది. ఈ మేరకు హీరో మోటోకార్ప్ ప్రకటన విడుదల చేసింది.
టాటా గ్రూప్ కంపెనీ టాటా మోటార్స్.. తన కస్టమర్లకు భారీ షాక్ ఇవ్వనుంది. తన వాణిజ్య వాహనాల ధరలను జూలై 1 నుంచి 2 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి సరుకుల ధరలు పెరగడంతోనే ఈ మేరకు అన్ని మోడళ్లు, వేరియంట్ల ధరలను పెంచాల్సి వస్తోందని కంపెనీ తెలిపింది. ఇది మొత్తం వాణిజ్య వాహనాల శ్రేణికి వర్తిస్తుందని.. మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతాయని కంపెనీ పేర్కొంది.
తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల తగ్గుముఖం, లాక్‌డౌన్ ఎత్తివేతతో అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తిస్థాయి సన్నద్థతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. శనివారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలు ప్రారంభం అయినప్పటి నుంచి విద్యార్థులు, సిబ్బంది కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కేబినెట్ పలు సూచనలు చేసింది. కాగా తెలంగాణలో లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని కాసేపటి…