భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన బైక్‌లు, స్కూటర్ల ధరలను పెంచబోతోంది. జూలై 1, 2024 నుంచి కంపెనీ ధరలను పెంచనుంది. ఈ మేరకు హీరో మోటోకార్ప్ ప్రకటన విడుదల చేసింది. కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో చేర్చబడిన అన్ని బైక్‌లు, స్కూటర్‌ల ఎక్స్-షోరూమ్ ధరలను జులై 2024 నుంచి పెంచనుంది. ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతున్నందున.. వినియోగదారులపై భారం మోపేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం తక్కువ ధరలకు ద్విచక్ర వాహనాలను విక్రయిస్తు్న్న ఈ కంపెనీ మధ్యతరగతి ప్రజలుకు మేలు చేస్తోంది. కానీ పెరిగే ధరలతో కొత్తగా బైక్ కొనే వాళ్లు కలత చెందుతున్నారు.
READ MORE: Rahul Gandhi : రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదించిన ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్
జూలై 1, 2024 నుంచి అన్ని వాహనాల ధరలను రూ.1500 వరకు పెంచనున్నట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది. మోడల్, వేరియంట్ ను బటటి ధరలో మార్పు ఉంటుందని కంపెనీ పేర్కొంది. బడ్జెట్ స్థాయి బైక్‌లతో పాటు, స్పోర్ట్స్ సెగ్మెంట్ బైక్‌లను కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అందిస్తున్నారు. దీనితో పాటు, కంపెనీ స్కూటర్ సెగ్మెంట్లో అనేక గొప్ప ఎంపికలను కూడా అందిస్తుంది. Splendor+, Splendor + Xtec, Splendor+ Xtec2.0, HF Deluxe, HF100, Glamour, Passion , Xpulse 200T 4V బైక్‌లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చారు. వీటితో పాటు, కంపెనీ డెస్టినీ ప్రైమ్, ప్లెజర్+ Xtec18, Xoom, Destini 125Xtec వంటి స్కూటర్లను కూడా విక్రయానికి అందుబాటులో ఉంచింది.