శ్రేయస్ హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన సూర్యకుమార్.. ఏం చెప్పాడంటే?! సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. క్యాచ్ అందుకునే ప్రయత్నంలో తీవ్ర గాయానికి గురైయ్యాడు. ప్రస్తుతం సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. శ్రేయస్ ఆరోగ్యం గురించి టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అప్‌డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రేయస్ బాగానే ఉన్నాడని, వైద్యులు నిత్యం అతన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పాడు. ఇది మనకు శుభవార్త…