BJP National President: కమలం పార్టీలో నడ్డా శకం ముగిసింది.. బీజేపీకి నయా సారథి ఇతడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP National President: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శుక్రవారం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. జనవరి 19న పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవికి నామినేషన్లు దాఖలు చేస్తారు. మరుసటి (జనవరి 20న) రోజు కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ పోటీ లేకుండానే జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో మరే ఇతర నాయకుడు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు కనిపించడం లేదు.
READ ALSO: UP Video: ముఖ్యమంత్రి చెవిలో బుడ్డోడు గుసగుసలు.. వింతైన కోర్కెకు నవ్వుకున్న యోగి
Also Read
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
బీజేపీ జాతీయ రిటర్నింగ్ అధికారి కె.లక్ష్మణ్ విడుదల చేసిన సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు జనవరి 19న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరణ ఉంటుంది. అవసరమైతే జనవరి 20న ఓటింగ్ జరుగుతుందని లక్ష్మణ్ తెలిపారు. ఆ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడి పేరును పార్టీ వర్గాలు అధికారికంగా ప్రకటిస్తారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా స్థానంలో నబిన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా పార్టీ నాయకత్వం అంతా ఆయన నామినేషన్‌కు మద్దతు ఇస్తున్నారు.
నిజానికి గతంలో కూడా జేపీ నడ్డా కూడా మొదట జూన్ 2019 లో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. అనంతరం జనవరి 20, 2020 న అమిత్ షా స్థానంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నితిన్ నబిన్ నేపథ్యం ఏమిటంటే..
దివంగత బీజేపీ ప్రముఖుడు, మాజీ ఎమ్మెల్యే నబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు.. ఈ 45 ఏళ్ల నితిన్ నబిన్. ఇతనికి పార్టీలో బలమైన సైద్ధాంతిక నేపథ్యం, సంస్థ పట్ల లోతైన నిబద్ధత కలిగిన డైనమిక్ నాయకుడిగా పేరుంది. ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చారు. నబిన్ ప్రస్తుతం బీహార్‌లోని బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీహార్ ప్రభుత్వంలో ఈయన రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు.
READ ALSO: స్టైల్‌తో పాటు సౌండ్ కూడా.. Xiaomi Mijia Smart Audio Glasses గ్లోబల్‌గా లాంచ్..!
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!