తెలంగాణలో ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసిన తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని అత్యున్నత మీడియా సంస్థ అయిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (EGI) ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. ఫేక్ న్యూస్ ప్రచారం చేశారనే అభియోగాలతో ఎన్టీవీకి చెందిన ఇద్దరు జర్నలిస్టులను అర్ధరాత్రి వేళ హడావుడిగా అరెస్టు చేసిన విధానాన్ని గిల్డ్ తీవ్రంగా ఖండించింది. ఈ అరెస్టుల విషయంలో పోలీసులు తీవ్రమైన అత్యుత్సాహం ప్రదర్శించారని, కోర్టు…