బీజేపీలో చేరాల్సిందిగా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆహ్వానంపై సిర్సా ఎంపీ కుమారి సెల్జా స్పందించారు. ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన శైలజ.. కాంగ్రెస్ రక్తం తన సిరల్లో ఉందని అన్నారు. తాను కాంగ్రెస్‌వాదిగానే ఉంటానని సూటిగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి వైరం లేదని అన్నారు. రానున్న కాలంలో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలిపారు.
ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి స్పీడ్ పెంచారు. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెప్పి వరుసగా సైకిలెక్కుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే సీటు దక్కకపోవడంతో ఆ పార్టీకి సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇంటికి బీఆర్ఎస్ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ వెళ్లారు. అనంతరం నాగం జనార్ధన్ రెడ్డితో వారు సమావేశం అయ్యారు. నాగంను బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు.