హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం ఆమె బీజేపీలో చేరనున్నారు. భివానీ జిల్లా పరిధిలోని తోషమ్ నియోజకవర్గం నుంచి కిరణ్ చౌదరి గెలుపొందారు. ఆమె కుమార్తె శృతి చౌదరి కూడా కమలం పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్ర కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. మరో కీలక నేత కమలం గూటికి చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాషాయ గూటికి చేరారు.
జార్ఖండ్ అధికార పార్టీ జేఎంఎంలో సొంత కుటుంబం నుంచే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోదరుడి భార్య, జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ ఆ పార్టీకి గట్టి షాకిచ్చారు.
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగలుతున్నాయి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ అగ్ర నేతలు పార్టీని వీడి బీజేపీ గూటికి చేరిపోయారు. తాజాగా కేరళలో మహిళా కాంగ్రెస్ నేత కమలం గూటికి చేరారు.
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీలోని కీలక నేతలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రాజీనామా చేసి బీజేపీకి గూటికి చేరిపోయారు.