Tech Layoffs: గ్లోబల్ ఐటీ దిగ్గజ కంపెనీలు వరసగా తమ లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తమ ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. దీంతో సాఫ్ట్‌రంగంలో ఉద్యోగులకు భద్రత కరువైంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఇలా ఉద్యోగుల్ని తీసేయడానికి టెక్ కంపెనీలు బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. తీసేసిన ఉద్యోగులకు ప్యాకేజీలను అందిస్తున్నాయి. సెవరెన్స్ ప్యాకేజీలు, నోటిస్ పే, అవుట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్, వీసా సాయం, మానసిక ఆరోగ్య సహాయం వంటి వాటికి ఖర్చు చేస్తున్నాయి.
Microsoft Layoffs: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోత విధించింది. వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తోన్న పలు టీమ్స్ కు చెందిన వారిని తాజాగా విడుదల చేసిన జాబితాలో నుంచి తొలగించినట్లు గ్రీక్ వైర్ అనే మీడియా సంస్థ పేర్కొనింది.
మన దేశానికి చెందిన దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్‌లోని టాటా స్టీల్ పలు దేశాల్లో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. యూకేలోని వేల్స్ లో ఉన్న తమ స్టీల్ ఉత్పత్తి ప్లాంట్‌లో పని చేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ పూనుకుంది.
IBM layoffs: ఆర్థిక మాంద్యం భయాలు, పలు దేశాల్లో ఆర్థిక వ్యవస్థ తిరోగమనం ఇలా పలు అంశాలు టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్స్‌కి కారణమవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఎక్స్ ఇలా పలు కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తీసేశాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో టెక్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
Recession: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆర్థికవేత్తలు ఈ ఏడాది ఆర్థికమాంద్యం తప్పదని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోపియన్ దేశాలు కూడా ఆర్థికమాంద్యాన్ని ఏదుర్కొవాల్సిందే అని చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా ఫెడరల్ బ్యాంక్ ద్రవ్యోల్భణం, ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వడ్డీరేట్లను పెంచుతోంది. ఇక బ్రిటన్ వ్యాప్తంగా నిత్యావసరాల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ మాంద్యం గురించి హెచ్చరించింది.
Tech Layoffs: టెక్ ఉద్యోగులు ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని దినదినగండంగా రోజులు గడిపేస్తున్నారు. ఆర్థికమాంద్యం ప్రభావంతో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ సంస్థలు వేలాది మందిని ఇప్పటికే ఉద్యోగాలనుంచి తొలగించాయి.