జార్ఖండ్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. నవంబర్ 13న ఫేజ్-1 ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. బుధవారం 43 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. ఉదయం నుంచి ఓటర్లు ఉత్సాహం పోలింగ్ బూత్‌లకు తరలివచ్చి ఓట్లు వేశారు. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే ప్రజలు భారీగా ఓటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అన్ని పోలింగ్ బూతుల్లో పెద్ద ఎత్తున క్యూలైన్లు దర్శనమిచ్చాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి.
ఇది కూడా చదవండి: The Rana Daggubati Show : సెలబ్రిటీల జీవితాల్లోని ఎవరికీ తెలియని కోణాలు వెలికి తీసేందుకు ది రానా దగ్గుబాటి షో!
తొలి విడతలో మాజీ టీమిండియా కెప్టెన్ ఎంఎస్.ధోనీ దంపతులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ పోలింగ్ బూతులో ఓటు వేశారు. ధోనీ.. తన భార్యతో కలిసి వచ్చి ఓటు వేశారు. అయితే ధోనీని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఎగబడ్డారు. దీంతో భారీ బందోబస్తు మధ్య ధోనీ దంపతులకు రక్షణ కల్పించారు. మరోవైపు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దంపతులు కూడా తొలి విడత పోలింగ్‌లో భాగంగా ఓటు వేశారు.
ఇది కూడా చదవండి: Bulldozer Action: ‘‘బుల్డోజర్ ఇప్పుడు గ్యారేజీకి వెళ్తుంది’’.. సీఎం యోగిపై అఖిలేష్ విమర్శలు..
బుధవారం జార్ఖండ్‌తో పాటు వయనాడ్ లోక్‌సభతో పాటు పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరిగాయి. జార్ఖండ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. బుధవారం తొలి విడత ముగియగా.. సెకండ్ విడత నవంబర్ 20న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.
#WATCH | Former Indian cricket team captain MS Dhoni along with his wife, Sakshi arrives at a polling booth in Ranchi to cast his vote for #JharkhandAssemblyElections2024 pic.twitter.com/KlD68mXdzM
— ANI (@ANI) November 13, 2024
#WATCH | Former Indian cricket team captain MS Dhoni casts his vote at a polling booth in Ranchi for #JharkhandAssemblyElections2024 pic.twitter.com/tNIkwoXIiy
— ANI (@ANI) November 13, 2024